డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా క్జెర్ థెల్విగ్ ఈ ఏడాది మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది. మొదటి రన్నరప్‌గా నైజీరియాకు చెందిన చిడిన్మా అడెత్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ ఎంపికైయ్యారు. ఇక మూడో రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ఒపాల్ సుచతా చువాంగ్స్రీ, నాల్గో రన్నరప్‌గా వెనిజులాకు చెందిన ఇలియానా మార్క్వెజ్ ఉన్నారు. ఈ మిస్ యూనివర్స్ 2024 అందాల పోటీలు ఈ ఏడాది మెక్సికోలో జరిగాయి.
భారత్ కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ 2024 గ్రాండ్ ఫినాలేలో కూడా పాల్గొన్నారు. ఆమె టాప్ 30లో తన స్థానాన్ని దక్కించుకుంది. కానీ టాప్ 12లోకి రాలేకపోయింది. కాగా, 73వ మిస్ యూనివర్స్ పోటీల్లో చరిత్రలోనే అత్యధికంగా 125 ఎంట్రీలు వచ్చాయి. 2018లో వచ్చిన 94 రికార్డును ఇది బద్దలు కొట్టింది అని చెప్పాలి. నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ గతేడాది మిస్ యూనివర్స్ విజేతగా ఎంపికయ్యారు. కాగా, ఈసారి మిస్ యూనివర్స్ కిరీటం చాలా స్పెషల్. దీనికి లూమియర్ డి ఎల్ ఇన్ఫిని అని నామకరణం చేశారు. ఈ మిస్ యూనివర్స్ కిరీటం మహిళల సాధికారతను సూచిస్తుందని నిర్వహకులు తెలిపారు.