రోహిణి కోర్టు మమళ్లీ కాల్పుల శబ్దంతో ఉలిక్కిపడింది. కోర్టు ఆవరణలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు లాయర్లు తమ క్లయింట్స్ విషయంలో గొడవే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. క్లయింట్స్ విషయంలో కోర్టు ఆవరణలో ఉదయం ఇద్దరు న్యాయవాదులు ఘర్షణకు దిగారు. ఇరువురి మధ్య తోపులాట జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ నాలాగాండ్ పోలీసు వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాట కారణంగా పోలీసు వద్ద ఉన్న గన్ మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ నేరుగా నేలను తాకడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఒక్కసారిగా బుల్లెట్ శబ్దం రావడంతో కోర్టు ఆవరణలో ఉన్న వారందరూ షాక్‌కు గురయ్యారు. అయితే లాయర్లను సముదాయించే ప్రయత్నంలో గన్ మిస్ ఫైర్ అయ్యిందా..? లేక సదరు పోలీసే కాల్పులు జరిపాడా..? అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నది. ఈ ఘటన ఉదయం 9.40 నిమిషాలకు జరిగింది. ముగ్గురి మధ్య జరిగిన ఘర్షణలో సంజీవ్ చౌదరీ, రిషీ చొప్రాలు న్యాయవాదులు కాగా.. రోహిత్ బేరీ క్లయింట్‌గా ఉన్నాడు. ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. తూటా కవచం విడిపోయి వారికి తగలడంతో గాయపడ్డారు. ఘర్షణకు దిగిన ఇద్దరు.. సదరు పోలీస్‌పై కూడా చేయి చేసుకున్నారు. దీంతో సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement