మణుగూరులో వెలుగుచూసిన ఘటన
డాక్టర్‌కు దేహశుద్ధి చేసిన మహిళా సంఘాలు
వివాహేతర సంబంధమే కారణం
అనంతరం పోలీసులకు అప్పగింత
మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండగా పట్టుకున్న భార్య
తనకు ప్రాణహాని ఉందన్న రెండో ఆమె
ఆంధ్రప్రభ స్మార్ట్, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సంఘమిత్ర హాస్పిటల్ డాక్టర్ రమాకాంత్‌కు వివాహేతర సంబంధం ఉందని, తన భార్య సంఘమిత్ర మహిళా సంఘాల సహకారంతో దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆదివారం రాత్రి మణుగూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
భార్య ఉంటుండగా రెండో పెళ్లి..
మణుగూరు పట్టణంలో సంఘమిత్ర హాస్పిటల్‌ను వైద్యురాలు సంఘమిత్ర, తన భర్త డాక్టర్ రమాకాంత్ నిర్వహిస్తున్నారు. అందులో పనిచేస్తున్న మరో మహిళా డాక్టర్ ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. అలా ఆ మహిళపై కన్నువేసి 2015లో రమాకాంత్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. కాగా, ఆదివారం రాత్రి డాక్టర్ రమాకాంత్ ఆ మహిళ ఇంట్లోనే ఉన్నారని తెలుసుకున్న భార్య సంఘమిత్ర మహిళా సంఘాలతో కలిసి అక్కడికు చేరుకున్నారు. అక్కడే ఉన్న తన భర్తకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను డాక్టర్ సంఘమిత్ర కోరారు.
నాకూ ప్రాణహాని ఉంది …
తనను 2015లో డాక్టర్ రమాకాంత్ పెళ్లి చేసుకున్నారని మరో మహిళ మీడియాకు తెలిపారు. తనకు డాక్టర్ సంఘమిత్ర, మహిళా సంఘాల నుంచి ప్రాణహాని ఉందన్నారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.