Tuesday, November 26, 2024

మైక్రోసాఫ్ట్‌ చేతికి మినిట్‌.. స్టార్టప్ ఫౌండర్లకు అండగా నిలిచేందుకే

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఖాతాలో మరో సంస్థ చేరింది. ప్రాసెస్‌ మైనింగ్‌ టెక్నాలజీలో అగ్రగామి సంస్థగా ఉన్న మినిట్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. మినిట్‌ సంస్థ వ్యాపార వ్యవహారాల ఆపరేషన్స్‌ నిర్వహణలో మెరుగైన కార్యాచరణ సామర్థ్యం కోసం అవకాశాలను వెలికితీయడంలో ప్రసిద్ధి పొందింది. వ్యాపార ప్రక్రియ డిజిటల్‌గా రూపాంతం చెందడానికి, కార్యాచరణ నైపున్యం పెంచుకునేందుకు మినిట్‌ తమకు సహకారం అందిస్తుందని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. వ్యాపార ప్రక్రియలను విశ్లేషించి మెరుగుపరచడానికి మినిట్‌ సహకరించనుందని వివరించింది. తద్వారా తమ కస్టమర్లు ప్రాసెస్‌ డేటాను మెరుగ్గా అర్థం చేసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇటీవల మైక్రోసాఫ్ట్‌ ఆర్‌పీఎ సాఫ్ట్ వేర్‌ ప్రొవైడర్‌ అయిన సాఫ్ట్ మోటివ్‌ను కొనుగోలు చేసింది. దేశంలోని స్టార్టప్‌ల కోసం ఫౌండర్స్‌ హబ్‌ను మైక్రోసాఫ్ట్‌ గురువారం ప్రారంభించింది. స్టార్టప్‌ ఫౌండర్లకు ఈ ప్లాట్‌ఫామ్‌ అండగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. తాజాగా మినిట్‌ను కొనుగోలు చేయడంతో పొలారిస్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ ప్రకారం 2030నాటికి సాఫ్ట్‌వేర్‌ రంగంలో మైక్రోసాఫ్ట్‌ 11బిలియన్‌ డాలర్లుకు చేరుకుని అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement