– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
తల్లిదండ్రులు బాలికను నిలదీయడంతో అసలు వాస్తవం బయటపెట్టింది. తనను బెదిరించి, చంపేస్తామని భయపెట్టి రోజూ లైంగిక దాడికి పాల్పడేవారని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు కంప్లెయింట్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు మలప్పురంలో అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు బాలిక సోదరుడు కాగా, మరొకరు ఆమె బంధువు. కాగా, ప్రస్తుతం ఆ బాలిక ఐదు నెలల గర్భిణి కావడం గమనార్హం.
అయితే.. ఆ బాలికను చైల్డ్ లైన్ నిర్వహిస్తున్న యూనిట్‌కు తరలించారు. 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు ఆమె ఇంట్లోనే జరిగాయి. హెల్త్ బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లగా ఆమె ఐదు నెలల గర్భిణి అని తేలింది. బాలిక వాంగ్మూలాన్ని అనుసరించి 24 ఏళ్ల సోదరుడు, బంధువును అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.