Friday, January 24, 2025

Uttarakhand | ఉత్తరకాశీలో భూకంపం..

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఉత్తరకాశీ జిల్లాలో శుక్రవారం ఉదయం స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు నమోదయ్యారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది.

భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. అయితే స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement