Tuesday, November 19, 2024

జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి 195 కోట్ల పరిహారం!

అమెరికాలో గతేడాది జార్జ్ ఫ్లాయిడ్ ఘటన సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. శ్వేతజాతి పోలీస్ అధికారి చేతిలో మరణించిన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి స్థానిక అధికారులు 27 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.196కోట్లు)​ నష్టపరిహారంగా చెల్లించడానికి అంగీకరించారు.ఈ విషయాన్ని మిన్నెసోటా నగర లాయర్లు శుక్రవారం ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అన్యాయంగా ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపేశారని, ఇది వారికి తగిన గుణపాఠం అని ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఇక ఈ ఒప్పందంపై ఫ్లాయిడ్ సోదరుడు రోడ్నీ స్పందించారు. ఇకమీదట నల్లజాతీయులపై తెల్లజాతీయుల దౌర్జన్యానికి దిగాలంటే కొంచెం ఆలోచిస్తారని ఆయన అన్నారు. జార్జ్ ప్లయిడ్ మరణానికి తగిన న్యాయం జరిగిందని ఫ్లాయిడ్ ఫ్యామిలీ లాయర్ బెన్ క్రంప్ పేర్కొన్నారు. ఇది అగ్రరాజ్యం చరిత్రలోనే అతిపెద్ద ప్రీ-ట్రయల్ సెటిల్మెంట్ అని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement