Thursday, November 21, 2024

కాసినోల కార్యకలాపాలపై మంత్రుల పరిశీలన.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ కార్యకలాపాల విలువను అంచనా వేసి వాటిపై ఎంత రేటు చొప్పున జీఎస్టీ  విధించవచ్చో పరిశీలించడానికి జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణ కోసం నియమ నిబంధనలు రూపొందించే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలతో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో ఆడేది స్కిల్‌ గేమా లేక చాన్స్‌ గేమా అనే దానితో నిమిత్తం లేకుండా బెట్టింగ్‌, గాంబ్లింగ్‌ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌పై జీఎస్టీ విధిస్తోంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై జీఎస్టీని సవాలు చేస్తూ కొన్ని కేసులు కూడా దాఖలయ్యాయని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement