బ్రిటన్ ప్రధాని రిషిసునాక్ ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. తన సన్నిహిత మిత్రుడు ఒకరు కేబినెట్‌కు రాజీనామా చేయడం సునాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పటి వరకు పోర్ట్‌ఫోలియో లేకుండా మంత్రిగా ఉన్న సర్ గావిన్ విలియమ్సన్, తోటి కన్జర్వేటివ్ పార్టీ సహచరులు, సివిల్ సర్వెంట్‌ల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తన రాజీనామాను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మిస్టర్ సునక్ విలియమ్సన్ రాజీనామాను చాలా బాధతో ఆమోదించారని, వ్యక్తిగత మద్దతు, విధేయతకి ధన్యవాదాలు అని ట్వీట్‌చేశారు.
కన్జర్వేటివ్ ప్రభుత్వాలకు, పార్టీకి మీ నిబద్ధత తిరుగులేనిది అని గావిన్ అన్నారు. అయినప్పటికీ, ప్రతిపక్షం ఈ ఎపిసోడ్‌ను సునాక్ అసమర్థ నాయకత్వంగా పేర్కొంది. లేబర్ పార్టీ నాయకుడు సర్ కైర్ స్టార్మర్ #హౌస్ ఆఫ్ కామన్స్‌లో వారానికోసారి ప్రశ్నలు సంధిస్తూ ప్రధానిపై ఒత్తిడిని పెంచుతున్నారు. విలియమ్సన్ ప్రవర్తనపై వివాదం కొనసాగుతోంది.