రైతు రుణమాఫీకి సంబంధించిన రేషన్‌కార్డు నిబంధనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ రేషన్ కార్డు కుటుంబ పోషణ కోసమేనని స్పష్టం చేశారు. అందరి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని…. కుటుంబం నిర్ధారించిన తర్వాత మిగిలిన వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని వివరించారు.
2018లో రుణమాఫీకి అనుసరించిన విధానాలనే ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రూ.2లక్షల రుణాలను ఏక కాలంలో మాఫీ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం శోచనీయం అని మండిపడ్డారు.