Tuesday, November 12, 2024

TG | ధాన్యం కొనుగోళ్లపై మంత్రివర్గ సబ్‌కమిటీ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోళ్లుగా సజావుగా సాగేందుకు, కొనుగోళ్లలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపంఘాన్ని నియమించింది.

ఈ మంత్రివర్గ ఉప సంఘానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ , ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీఎస్‌. చౌహాన్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపంఘం ధాన్యం కొనుగోళ్లలో… ధాన్య సేకరణతొ పాటు- గోదాములు, మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీ-లు, మిల్లింగ్‌ ఛార్జీలు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement