కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మంత్రి తలసాని సెటైర్లు వేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ఇప్పటి వరకు ఒక్కరూ సభకు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పూర్తిగా రాలేదన్నారు. ఒక్కొక్కరూ ఒక్కో ఎజెండా- జెండాలు వేసుకోని వస్తారని విమర్శించారు. సభకు రాకుండా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అధికార పక్షంపై ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. అడిగినప్పుడు మైక్ ఇస్తున్నా.. అవకాశం ఇవ్వడం లేదని ఒకరు గొడవ చేస్తారన్నారు. పద్దులపై కాంగ్రెస్ సభ్యులు ఎంతమంది ఉంటే అందరికి మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వాళ్లలో వాళ్లకు సఖ్యత లేదన్నారు. ఇదంతా వాళ్ళ అంతర్గత రాజకీయమని, సభకు రాకుండా, ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement