Monday, November 18, 2024

ఏపీ విద్యార్థుల్లో పరీక్షలపై టెన్షన్.. కీలక ప్రకటన చేసిన మంత్రి సురేష్

ఏపీలో ప్రస్తుత కరోనా పరిస్థితులకు అనుగుణంగా పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నాన్ని రాజకీయం చేసే రీతిలో నారా లోకేష్ వ్యాఖ్యలు సరైనవి కాదని మండిపడ్డారు. ఆయన వాస్తవాలు తెలుసుకుని రాజకీయం చేయాలని హితవు పలికారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలోని విద్యార్థుల భవిష్యత్ నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కాగా అంతకుముందు కరోనా విపత్కర పరిస్థితుల్లో పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. పవన్‌కు కొనసాగింపుగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీఎం జగన్ కు లేఖ రాయడం, నారా లోకేష్ ఏకంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement