మెటల్ గొలుసుతో వీపుకేసి కొట్టుకున్నారు ఓ మంత్రి..వివరాలు చూస్తే .. గుజరాత్ మంత్రి అరవింద్ రయాని వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి తన చర్యలతో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ, దీన్ని మూఢనమ్మకంగా పేర్కొనడం తప్పన్నారు. నమ్మకాలకు, మూఢ నమ్మకాలకు మధ్య చాల పలుచటి గీతే ఉంటుందంటూ బీజేపీ సైతం అరవింద్ కు మద్దతుగా నిలిచింది. రాజ్ కోట్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో మంత్రి అరవింద్ పాల్గొన్నారు. అక్కడి దేవతా పూజలో భాగంగా ఆయన ఇనుప గొలుసులతో తనను తాను శిక్షించుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి కరెన్సీ నోట్లను వెదజల్లారు నా చిన్న నాటి నుంచి ఆ దేవతకు భక్తుడిని. మా స్వగ్రామంలో మా కుటుంబం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. దీన్ని మూఢనమ్మకంగా పిలవొద్దు. మా దేవతను ఆరాధించుకుంటున్నాం అంతే’’ అని మంత్రి స్పష్టం చేశారు.
మెటల్ గొలుసుతో వీపుకేసి కొట్టుకున్నమంత్రి – మూఢనమ్మకం కాదు – దేవతని ఆరాధిస్తున్నా
Advertisement
తాజా వార్తలు
Advertisement