Wednesday, November 20, 2024

TG | న‌ర్స‌న్న స‌న్నిధిలో మంత్రి శ్రీ‌ద‌ర్‌బాబు

  • అభివృద్ధి ప‌నుల‌పై ఆరా
  • యాద‌గిరిగుట్ట‌లో ప్ర‌త్యేక పూజ‌లు
  • స్వాగ‌తం ప‌లికిన ఆల‌య ఈవో
  • వేద పండితుల ఆశ్వీర‌చ‌నాలు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, యాద‌గిరి గుట్ట‌ : యాద‌గిరి గుట్ట‌లోని ల‌క్ష్మీన‌రసింహ స్వామికి మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు బుధ‌వారం ప్రత్యేక పూజలు చేశారు. ఈసంద‌ర్భంగా అభివృద్ధి ప‌నుల‌పై ఆరా తీశారు. ఆల‌యానికి వ‌చ్చిన మంత్రికి ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్కర్ రావు స్వాగ‌తం ప‌లికారు. తూర్పు రాజ‌గోపురం ద్వారం వ‌ద్ద‌ ఆలయ సంప్ర‌దాయాల‌ ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు పూర్ణ‌కుంభంతో స్వాగతం పలికారు.

మంత్రికి వేద పండితుల ఆశ్వీర‌చ‌నాలు…
క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామిని తొలుత మంత్రి శ్రీ‌ధ‌ర్ ద‌ర్శించుకున్నారు. అభిషేకం అనంత‌రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబుకు స్వామి వారి అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం నిర్వహించిన అనంతరం స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటం అంద‌జేశారు.

- Advertisement -

అభివృద్ధి ప‌నుల‌పై ఆరా…
ద‌ర్శ‌నం అనంత‌రం అభివృద్ధి ప‌నుల‌పై మంత్రి ఆరా తీశారు. వేంచే పు మండపం ప్రాంగణంలో నుంచి ఆలయ అభివృద్ధి ప‌నులు ప‌రిశీలించారు. టెంపుల్ సిటీ, తులసి కాటేజ్ ప‌నుల కోసం ఆలయ ఈవో భాస్కర్ రావుతో చర్చించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement