Friday, January 10, 2025

TG | రాజస్థాన్‌కు మంత్రి సీతక్క..

రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో కేంద్రమహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చింతన్‌ శివిర్‌ కు పంచాయితీ రాజ్‌ శాఖా మంత్రి సీతక్క హాజర వుతున్నారు. మిషన్‌ వాత్సల్య, మిషన్‌ శక్తి, అంగన్వాడి పోషన్‌ 2.0 పై ఈ సమావేశంలో చర్చిం చనున్నారు.

రేపు శుక్రవారం రాత్రి ఉదయపూర్‌కి బయలుదేరి వెళుతున్న మంత్రి సీతక్క శనివారం జరిగే చింతన్‌ శివిర్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణలో మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేకంగా అమలవుతున్న పథకాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారం వంటి అంశాల మంత్రి సీతక్క వివరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement