మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని లోని కస్తూర్భా గాంధీ బాలికల విధ్యాయలయంలో 43 మంది విద్యార్థినీల అస్వస్థత (ఫుడ్ పాయిజన్) ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, డీఈవోతో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. వెంటనే డీఈవో, సంబంధిత అధికారులను, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ కొనసాగించాలంటూ మంత్రి ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి విద్యార్థుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి.. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రస్తుతం చికిత్స అందుతుందని మంత్రి తెలిపారు. ఘటన జరిగినప్పటి నుండి నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా విద్యార్థినీల పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ అప్రమత్తం చేస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ ఘటన పై మంత్రి సత్యవతి ఆరా…
Advertisement
తాజా వార్తలు
Advertisement