Tuesday, November 19, 2024

గిరిజనుల ప్రకృతి ఆరాధనే సీత్లా.. తీజ్‌- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

వ్యవసాయమే ప్రధాన వృత్తిగా… విశేషమైన పశు సంపద తో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సీత్లా పండుగ జరుపుకొంటారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పండుగ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఐక్యతను చాటేలా నిర్వహించే ఈ పండుగ గిరిజన సంప్రదాయానికి అద్దం పడుతుందన్నారు. పంటలు బాగా పండాలని, పశు సంపద అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి ఆరాధన ఆ పండుగ అంతర్లీనంగా ఉంటుందని మంత్రి అజయ్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల వికాసానికి పెద్దపీట వేసిందని గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. గిరిజనులకు విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గిరిజన గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టంతో పోడు భూముల సమస్య ఏర్పడిందని అయినప్పటికీ ఈ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement