రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా.. తిరుమలాయపాలెం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలిపోయాయి. కారు డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రి పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కారును అక్కడే వదిలేసి… మంత్రి పొంగులేటి తన ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం చేరుకున్నారు.