ఏపీలో ఆన్లైన్ ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకంపై సచివాలయంలో సినీ పెద్దలతో మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు పాల్గొన్నారు. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లను అమ్మే అంశంపై మంత్రి పేర్ని నాని సినీ ఇండస్ట్రీకి చెందిన అభిప్రాయాలు, సలహాలు తీసుకోనున్నారు. ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును రియల్ టైమ్‌లో బదిలీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఏపీఎఫ్డీసీ ద్వారా ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ ను నిర్వహించనున్నట్టు ప్రభుత్వం సినీ నిర్మాతలకు వివరించనుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు థియేటర్ యాజమాన్యాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకుని వస్తామని ప్రకటించిన ఆన్లైన్ టికెట్ విధానంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. లవ్‌స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చిరంజీవి కూడా ఏపీ ప్రభుత్వం కనుకరించాలంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.