వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణంరాజు బ్లాక్ షీప్ అని వైసీపీ పార్టీలో గెలిచి మరో పార్టీ కోసం పని చేస్తున్నారని అన్నారు. సీఎల్పీ మీటింగ్ కు రఘురామకృష్ణంరాజు రావాలని డిమాండ్ చేశారు. సిగ్గుంటే వెంటనే రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలని అన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎంపీ చేశాడని ఇప్పుడు కొమ్ములు లేని దున్నపోతుల రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు.
ఎంపీ పదవిని అడ్డుపెట్టుకుని పిచ్చిపిచ్చిగా కూతలు కూస్తున్నారని అన్నారు. నా గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్ లో రఘురామకృష్ణంరాజు శిఖండిలా మారారని, వెయ్యి కోట్ల మోసం చేసిన చరిత్ర రఘురామకృష్ణంరాజుదని అన్నారు. చంద్రబాబు గురువైతే రఘురామ కృష్ణంరాజు శిష్యుడు అంటూ మండిపడ్డారు. ఇంకోసారి నా గురించి మాట్లాడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు పెద్దిరెడ్డి.