Saturday, November 23, 2024

అన్ని బ్యాంకులు ప్రైవేటీకరించం:నిర్మలమ్మ

ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. ప్రైవేటీకరించే బ్యాంకుల్లో ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్ల రెండు రోజుల సమ్మెను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. ప్రైవేటీకరణ నిర్ణయం మంచి ఆలోచనగా ఆమె అభివర్ణించారు. బ్యాంకులు మరింత ఈక్విటీ పొందాలనుకుంటున్నాం. దేశ ఆకాంక్షలను తీర్చేలా బ్యాంకులు పనిచేయాలని కోరుకుంటున్నామని ఆమె చెప్పారు. ప్రైవేటీకరణకు అవకాశమున్న బ్యాంకుల విషయంలో ప్రతి ఒక్క సిబ్బంది ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతమున్న సిబ్బంది.

ప్రయోజనాలకు ఎలాంటి డోకా ఉండదని ఆమె భరోసా ఇచ్చారు. ప్రభుత్వరంగ బ్యాంకులతోనే కేంద్రం కొనసాగబోతోందని ప్రభుత్వరంగ సంస్థలపాలసీ స్పష్టం చేస్తోంది. ఈ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందికి కూడా రక్షణఉంటుందని ఆమె పునరుద్ఘాటించారు. కాగా గత శని, ఆదివారాల్లో బ్యాంకులకు సెలవు సోమ, మంగళ వారాల్లో సమ్మెతో బ్యాంకు సేవలపై ప్రభావం పడింది.దాదాపు 10 లక్షల మంది బ్యాంకింగ్ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొన్నారని అంచనాగా ఉంది. బ్యాంకు లను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా బ్యాంక్ఉద్యోగులు ఈ సమ్మెను చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement