మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల కేసులో కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని అంటూ కేంద్రమంత్రి నారాయణ్ రాణె చేసిన వ్యాఖ్యలపై దూమారం రేపుతోంది. రాణె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన శివసేన కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. నాసిక్‌లోని బీజేపీ కార్యాలయంపై రాళ్లురువ్వారు. నాసిక్‌సహా పలు ప్రాంతాల్లో శివసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కేంద్ర మంత్రిపై నాసిక్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేంద్ర మంత్రి అరెస్టుకు పోలీసులు వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రిని కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయకపోయినా… అరెస్టు ప్రక్రియ కొనసాగుతోందన్నట్లు తెలుస్తోంది. అయితే, తనను పోలీసులు అరెస్టు చేయకుండా చూడాలంటూ కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను ముంబై హైకోర్టును ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: పేట్లబురుజులో వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భణి మృతి