Wednesday, November 20, 2024

సీఎం ఎక్కడుంటే.. అదే ఏపీ రాజధాని: మంత్రి మేకపాటి

మూడు రాజధానుల ప్రకటనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. రాజ్యాంగంలో ప్రత్యేకంగా రాజధాని అనే పదమే లేదన్నారు. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అని.. అది పులివెందుల కావొచ్చు, విజయవాడ కావొచ్చు, విశాఖ కావొచ్చు అని చెప్పారు.

సీఎం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్ ఉంటుందని, అదే రాజధాని అవుతుందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలో కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: భార్య వేధింపులు తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌కే నిప్పుపేట్టిన భర్త

Advertisement

తాజా వార్తలు

Advertisement