హుస్నాబాద్ : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో పర్యటిస్తున్నారు. మంత్రి కేటీఆర్ కు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడిదల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ రమణ తదితరులు స్వాగతం పలికారు. హుస్నాబాద్ పట్టణంలో రూ.2 కోట్ల నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియం, రూ.2.25 కోట్లతో నిర్మించిన డిగ్రీకాలేజ్, రూ.1 కోటితో నిర్మించిన ఎస్టీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్, రూ.9.68 లక్షలతో నిర్మించిన టు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు. అదే విధంగా హుస్నాబాద్ పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించిన టీటీసీ కళాశాల బిల్డింగ్, రూ.13 లక్షలతో నిర్మించిన బస్తి దవాఖానలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. హుస్నాబాద్ పట్టణంలో రూ. 1.55కొట్లలతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్ పాల్గొన్నారు.
హుస్నాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement