యువత ఉద్యోగ – ఉపాధి అవకాశాల భర్తీపై ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ లేఖలో డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న మోడీ ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఒక రాష్ట్రంగా తెలంగాణ ఇప్పటికే లక్షల 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతుందన్నారు. ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలపై దెబ్బ కొడుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ లేఖలో తెలిపారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధానమంత్రి విఫలమయ్యారన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే ఐటిఐఆర్ ప్రాజెక్టు రద్దు ద్వారా పెద్ద దెబ్బ కొట్టారన్నారు. ప్రధానమంత్రి మోడీకి ఉద్యోగాల భర్తీ పైన పలు ప్రశ్నలు కేటీఆర్ సంధించారు.
ఉద్యోగ – ఉపాధి అవకాశాల భర్తీపై ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
Advertisement
తాజా వార్తలు
Advertisement