కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఎనిమిదేళ్లలో పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలక నిర్ణయాలతో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. మరింత అభివృద్ధి సాధించే దిశగా పలు కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పారిశ్రామిక రంగంలో చేపట్టిన పనులకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ – వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ – నాగపూర్ కారిడార్ కు నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్ కి కూడా నిధులు ఇవ్వాలని, అదేవిధంగా చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని లేఖలో పేర్కొన్నారు. ఖమ్మంలో సెయిర్ స్టీల్ ప్లాంట్, ఫార్మసిటీకి నిధులు ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్ లో సీసీఐ రీ ఓపెన్ చేయాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement