తెలంగాణలో వైఎస్ ఆర్ టీపీ పార్టీని స్థాపించి ,నిరుద్యోగ సమస్యలపై గళం విప్పిన వైఎస్ షర్మిల, మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడింది. చిన్నదొరా అంటూ ఎద్దేవా చేసింది. తాము ఇచ్చిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు.. పది ఇందిరమ్మ ఇళ్లకు సమానమని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పై షర్మిల స్పందించింది.. మీ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు 10 ఇండ్లతో సమానమా.. మరి 10 కుటుంబాలను ఒక్క డబుల్ బెడ్రూం ఇంట్లనే కాపురం ఉండమని చెప్పకపోయావా చిన్న దొరా అంటూ కేటీఆర్ పై షర్మిల సెటైర్ లు వేసింది. ఎందుకంటే మీకు కుటుంబానికి ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు ఇయ్యడం చేతకాదు కదా అంటూ వ్యాఖ్యానించింది. మీకు ఇంటికొక ఉద్యోగం ఇయ్యడం చేతకాదు కదని విమర్శలు గుప్పించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement