Saturday, November 23, 2024

TS – ఇవాళ 52దేశాల ఎన్ఆర్ఐల‌తో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫ‌రెన్స్

ఇవాళ మంత్రి కేటీఆర్ 52 దేశాల్లో నివసిస్తున్నఎన్ఆర్ఐల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. వీరిలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖల ప్రతినిధులు ఉండనున్నారు. వీరంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఎలా పాల్గొనాలి, ఏం చెయ్యాలి అనే దానిపై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన, అమలు చేస్తున్న పథకాలపై వీరు ప్రచారం చేయనున్నారు.


బీఆర్ఎస్ విదేశాల్లో బాగా విస్తరించింది. చాలా దేశాల్లో ఆ పార్టీకి శాఖలున్నాయి. బతుకమ్మ సహా రకరకాల కార్యక్రమాలను విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తోంది. అలాగే చాలా సందర్భాల్లో మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్లి, కాన్ఫరెన్సులు, ఆర్థిక, వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తద్వారా తమ పార్టీకి విదేశాల్లో మంచి గుర్తింపు దక్కేలా చేసుకుంటున్నారు. ఇవన్నీ పోల్ స్ట్రాటజీలో భాగంగా ఉన్నాయి. ఇవాళ్టి సమావేశం ద్వారా ప్రత్యేక ఓటర్ల సపోర్ట్ కూడా తమకే దక్కేలా కేటీఆర్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అందువల్ల ఈ కాన్ఫరెన్స్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement