Friday, November 22, 2024

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు 96 శాతం టీకా పూర్తి

తెలంగాణలో మున్సిప‌ల్ శాఖ‌లో ప‌ని చేస్తున్న ఫ్రంట్ లైన్ కార్మికులంద‌రినీ జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. వారంద‌రికీ క‌రోనా టీకా ఇస్తున్నామ‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని మున్సిప‌ల్ సిబ్బందికి 96.19%, మిగ‌తా 141 మున్సిపాలిటీల‌లోని సిబ్బందికి 95.55% టీకా పంపిణీ కార్య‌క్ర‌మం పూర్త‌యింద‌ని వెల్లడించారు. మున్సిప‌ల్ అడ్మినిస్ర్టేష‌న్ విభాగంలో టీకా పంపీణీ ప్ర‌క్రియ‌ను వీలైనంత త్వ‌ర‌గా 100 శాతం పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని కేటీఆర్ చెప్పారు.

కాగా, క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ముందు వ‌రుస‌లో ఉండి క‌నిపించ‌ని శ‌త్రువుతో పోరాటం చేశారు ఫ్రంట్ లైన్ వారియర్స్. తొలి ద‌శ ముగిసి సెకండ్ వేవ్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మ‌యంలోనూ పారిశుద్ధ్య కార్మికులు, హెల్త్ వ‌ర్క‌ర్లు, వైద్యులు, పోలీసులు తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి తొలి, రెండో డోసు కరోనా టీకా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement