Monday, November 25, 2024

బండి సంజయ్ కి స్ట్రాంగ్ కౌంటరిచ్చిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర మంత్రి కేటీఆర్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో డ్రగ్స్ విమర్శలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఈ విధంగా సమాధానమిచ్చారు. తాను డ్రగ్స్ టెస్టుకు ఏదంటే అది ఇస్తా అన్నారు. నేను డ్రగ్స్ టెస్ట్ కు రెడీ.. ఏ డాక్టర్ ని తెస్తాడో తెచ్చుకోమను అన్నారు. తన బొచ్చు ఇస్తా, రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా, వాడి బొంద ఏం కావాలంటే అది ఇస్తా, నా కిడ్నీ ఇయ్యమంటే కిడ్నీ కూడా ఇస్తా.. తాను క్లీన్ చీట్ తో బయటకి వస్తే.. బండి సంజయ్ కరీంనగర్ చౌరస్తా కమాన్ వద్ద ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకుంటాడా ? అన్నారు. దీనికి సిద్ధమైతే తాను ఇక్కడే ఉంటానని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement