Thursday, December 19, 2024

TG | పడమటి ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ..

మక్తల్, (ఆంధ్రప్రభ) : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు రథోత్సవం సందర్భంగా ఇవాళ సాయంత్రం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి మక్తల్ వచ్చిన మంత్రి కొండా సురేఖను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి, పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త ప్రాణేషాచార్య ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు మోసుకొని భాజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా తరలివచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను ఆలయ ధర్మకర్త స్థానిక ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.

- Advertisement -

పశ్చిమ ముఖంగా ఆంజనేయ స్వామిని ప్రతిష్టించినందునళ స్వామివారిని శ్రీ పడమటి ఆంజనేయ స్వామిగా పిలుస్తారని మంత్రికి వివరించారు . జాంబవంతులచే ప్రతిష్టించిన ఆలయం దేశంలోని ఇలాంటి ఆలయం లేకపోవడం ఎంతో విశిష్టమైనది అని వివరించారు .ఈ సందర్భంగా దేవాదాయకు సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్యాంసుందర్ చారి, సత్యనారాయణ, బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, మాజీ జడ్పిటిసి జి.లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు బోర రవికుమార్, గణేష్ కుమార్, చెన్నయ్య సాగర్, ఆనంద్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం ఆధ్వర్యంలో స్థానిక సీఐ చంద్రశేఖర్ ఎస్ఐ వై భాగ్య లక్ష్మారెడ్డి బద్ద బస్ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement