కోటి దీపోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సీతారాముల కల్యాణం మరో భద్రాచలం ఆవిష్కృతమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
కార్తీక మాస పూజల్లో భాగంగా సీతారాముల కల్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అపూర్వంగా నిర్వహిస్తున్న కోటిదీపోత్సవ నిర్వాహకులను మంత్రి కొండా సురేఖ అభినందించారు.