Sunday, December 22, 2024

TG | శ్రీతేజ్ ను పరామర్శించిన‌ మంత్రి కోమటిరెడ్డి…

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆరా తీశారు. శ్రీతేజ్ చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని… అవసరమైతే అమెరికా నుంచి అత్యాధునిక మందులను తెప్పించి బాలుడిని బతికించాలని కోమటిరెడ్డి వైద్యులకు సూచించారు. ఈ సంద‌ర్భంగా శ్రీతేజ్ శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కి రూ.25 లక్షల చెక్ అందించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాలుడిని చూస్తే బాధతో పాటు భయమేస్తుందన్నారు. బాలుడు ఎప్పుడు కోలుకుంటాడో తెలియదన్నారు. శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. శ్రీతేజ్ తల్లి రేవతి మరణం చాలా బాధాకరం.. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇకపై పుష్ప లాంటి సినిమాలు చూడనని.. సందేశాత్మక, దేశభక్తి, తెలంగాణ చరిత్ర సంస్కృతి నేపథ్యంలో తీసే సినిమాలకే రాయితీలు ఇస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement