Friday, September 20, 2024

TG: మంత్రి కోమ‌టిరెడ్డి ప్ర‌జాద‌ర్భార్‌కు విన‌తుల వెల్లువ‌..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న‌ల్ల‌గొండ : న‌ల్ల‌గొండ జిల్లాకు నాలుగు వేల ట‌న్నుల యూరియా అవ‌స‌రం ఉంద‌ని, త‌క్ష‌ణ‌మే పంపించాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఫోన్ చేశారు. నల్లగొండ పట్టణంలోని మున్సిపల్ పార్కులో ఇవాళ నిర్వహించిన ప్ర‌జాద‌ర్భార్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. జిల్లాకు యూరియా లేక రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, నాలుగు వేల మెట్రిక్ ట‌న్నుల యూరియా అవసరం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శ్రవణ్, మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. దీనికి మంత్రి స్పందించారు.

విన‌తుల వెల్లువ‌..
ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి విన‌తులు అధిక సంఖ్య‌లో వ‌స్తున్నాయి. ప‌లు స‌మ‌స్య మీద బాధితులు వ‌చ్చి త‌మ గోడు వినిపిస్తున్నారు.

- Advertisement -

ప్ర‌తీక ఫౌండేష‌న్ ద్వారా సాయం..
ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి ఆర్థిక సహాయం కోరగా కోమ‌టిరెడ్డి సూచన మేర‌కు ప్ర‌తీక ఫౌండేష‌న్ ద్వారా తక్షణమే సహాయాన్ని అందిస్తున్నారు. దీంతో బాధితులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

రూ.250 కోట్ల‌తో అభివృద్ధి..
ఆర్ అండ్ బీ రాష్ట్ర అధికారులతో మంత్రి కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ… తన నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప‌నులు మంజూరు చేశామ‌ని చెప్పారు. ఇంకా రావాల్సిన రూ.165 కోట్లను తక్షణమే మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌పై విన‌తుల వెల్లువ‌..
ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా వ్యక్తిగత సమస్యల‌పై విన‌తులు అధిక సంఖ్య‌లో వ‌స్తున్నాయి. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు తమకు బీఎల్ఓ విధుల నుండి తెప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవి, వ్యవసాయ శాఖ జేడీ శ్రవణ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement