Tuesday, November 26, 2024

మంత్రి జగదీష్ రెడ్డి ఔదార్యం.. ఆర్టీసీ ఉద్యోగికి బాసట..(VIDEO)

సూర్యాపేట : సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో సూర్యాపేట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. సమస్యల పై తనను నేరుగా కలిసినవారికే కాదు, ఆయన దృష్టికి వచ్చిన వారికి చేయూతనందించారు. తాజాగా మరోసారి జగదీష్ రెడ్డి ఆర్టీసి చిరుద్యోగి పట్ల తన మానవత్వాన్ని చాటిచెప్పారు. సూర్యాపేటకు చెందిన లతీఫ్ ఆర్టీసి డిపోలో శ్రామిక్ గా విధులు నిర్వహించేవాడు. లతీఫ్ కుటుంబాన్ని విధి వంచించడంతో రోడ్డు ప్రమాదంలో తన కాలును శాశ్వతంగా కోల్పోయాడు. దీంతో చాలా కాలంగా ఉద్యోగానికి దూరం అవడంతో పాటు, ఆర్టీసిలో శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయే పరిస్తితి వచ్చింది. ఆర్టీసి అధికారులు కూడా తిరిగి విధుల్లో చేర్చుకోవడానికి ససేమిరా అన్నారు. కుటుంభం కూడా గడవడం కష్ట తరంగా ఉన్న నేపథ్యంలో తన దీన పరిస్థితిని మంత్రి జగదీష్ రెడ్డికి విన్నవించుకోవడానికి సూర్యాపేట క్యాంపు ఆఫీసుకు వచ్చిన లతీఫ్ ను గమనించిన మంత్రి, నేరుగా ఆయన వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నాడు. లతీఫ్ పరిస్తితికి చలించిన మంత్రి నేరుగా అక్కడిక్కడే రాష్ట్ర ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తో మాట్లాడి లతీఫ్ ను ఉద్యోగంలో కొనసాగించాలని సిఫార్స్ చేశారు. అంతటితో ఆగకుండా లతీఫ్ ను చైర్మన్ కు కల్పించే బాధ్యతను వ్యక్తి గత సిబ్బందికి అప్పజెప్పారు. మంత్రి సిఫార్స్ తో ఆర్టీసి చైర్మన్ ను కలిసిన లతీఫ్ నేడో రేపో ఉద్యోగంలో చేరనున్నాడు. దీంతో లతీఫ్ తో పాటు అయన కుటుంభ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడంటే జగదీష్ రెడ్డి లా ఉండాలని, తమపై ఆయన చూపిన ఔదార్యానికి రుణపడి ఉంటామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement