Saturday, November 23, 2024

వర్షాలు, వరదలపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమీక్ష-అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌

నిర్మ‌ల్ ప్రతినిధి, ప్రభా న్యూస్ : నిర్మ‌ల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.. జిల్లా అధికారులతో క‌లెక్ట‌రేట్‌లో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పంట న‌ష్టం, పునరావాస ఏర్పాట్లను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

వ్యవసాయ, ఆర్అండ్ బి, విద్యుత్ శాఖ, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు, అంచనాలతో ప్రాథ‌మిక నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితి, ప్రస్తుతం తీసుకున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల‌కు మంత్రి దిశానిర్ధేశం చేశారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే సూచనలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు. జిల్లాలోని జలాశయాల్లో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాజెక్ట్ ల‌లోకి వ‌చ్చి చేరుతున్న‌ వ‌ర‌ద‌ను ఎప్ప‌టికప్పుడు ప‌ర్య‌వేక్షించాల‌ని, ఇన్ ప్లో ను బ‌ట్టి నీటిని బ‌య‌ట‌కు వ‌దిలేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement