హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ఠి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీష్‌రావు గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా మార్చి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని పేర్కొన్నారు. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్టుమార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా? అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని హరీష్‌రావు మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చిందని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అమ్మకానికి.. టీఆర్ఎస్ నమ్మకానికి ఈ ఎన్నిక మరో రూపమని తెలిపారు. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని.. 24 గంటల కరెంటు ఇస్తామంటే కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని.. కాళేశ్వరం పూర్తవుతుందా అన్నారు.. రైతులు వద్దనే రీతిలో నీళ్లు వస్తున్నాయని గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని హరీష్ పేర్కొన్నారు.
ఈ వార్త కూడా చదవండి: సముద్రం నిన్న ముందుకు.. నేడు వెనక్కు.. అసలు ఏం జరుగుతోంది?