మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాతను ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి పురస్కరించుకుని వన దేవతను దర్శించుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. ఏడుపాయలలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుపున మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి , మదన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి హరీష్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆలయాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం ఎంతో అద్భుతంగా నిర్మించామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు పుర్వవైభవం తీసుకొచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏడుపాయలకు యేటా నిధులు కేటాయిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దామని… కొండగట్టుకు రూ. 1000 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేస్తోందన్నారు. దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నామని తెలిపారు. హిందూధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీష్రావు వెల్లడించారు.
ఏడుపాయల వనదుర్గ మాతకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్ రావు..
Advertisement
తాజా వార్తలు
Advertisement