Thursday, November 21, 2024

పద్దతి మార్చుకోండి: గ్రామ సర్పంచ్లకు హరీశ్ ఆదేశం

గ్రామ అభివృద్ధి సంపూర్ణ బాధ్యత సర్పంచ్ లదేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గ్రామాలలో పెండింగులో ఉన్న పనులన్నీ అధికారుల సమన్వయంతో పూర్తి చేయించాలని ఆయా గ్రామ సర్పంచ్ లకు ఆదేశించారు. గురువారం సిద్ధిపేటలోని మంత్రి హరీశ్ నివాసంలో సిద్ధిపేట ప్రజాప్రతినిధులు, మండల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. మండల పరిధిలోని గ్రామాల వారీగా చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్పంచ్ లంతా టీమ్ లీడర్ గా వ్యవహరించి అసంపూర్తి పనులపై అధికారులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో చర్చించాలని సూచించారు. పలు గ్రామాలలో చేపడుతున్న పనులపై అధికారులకు కనీస పర్యవేక్షణ కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని, గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. మిషన్ భగీరథ తాగునీరు, విద్యుత్, వైకుంఠ ధామాలు, సెగ్రీ గేషన్ షెడ్- డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనం, కొత్త పంచాయతీ భవనాలు, గ్రామాల్లోని పలు కుల సంఘ భవనాల నిర్మాణాల ప్రగతి పనులన్నీ త్వరితగతిన చేపట్టాలని ఆయా శాఖాధికారులను మంత్రి ఆదేశించారు.

ఇది కూడా చదవండి: కృష్ణమ్మ పరవళ్లు.. సంగమేశ్వర ఆలయాన్ని తాకిన వరద నీరు

Advertisement

తాజా వార్తలు

Advertisement