ఏపీ ఫైబర్ నెట్లో కుంభకోణం జరిగిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ఫైబర్ నెట్లో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నామని, సీఐడీ రేపో, మాపో పేర్లతో సహా అక్రమార్కుల బండారం బట్టబయలు చేస్తుందని తెలిపారు. 2జీ స్పెక్ట్రమ్ తరహాలో చంద్రబాబు అండ్ కో చేసిన అవకతవకలన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.
చంద్రబాబు కారణంగా ఏపీ ఫైబర్ నెట్ రూ.650 కోట్ల మేర అప్పులపాలైందని ఆరోపించారు. వచ్చే ఏడాది నాటికి ఆ అప్పు అంతటినీ తీర్చేస్తామని అన్నారు. 2021 డిసెంబరు కల్లా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ పార్కులు ఏర్పాటు చేస్తామని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్త కూడా చదవండి: అనంతపురంలో జేసీ పవన్‌రెడ్డి అరెస్ట్