కరీంనగర్ నగరం లోని 42వ డివిజన్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు ఏది కావాలో సీఎం కేసీఆర్ కి తెలుసు అని, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి వెలుగు కార్యక్రమం ఒక వరం అన్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్ధాలను కూడా ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. వందరోజుల పాటు కంటి వెలుగు కార్యక్రనం కొనసాగుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్నన్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement