తొర్రూర్ టౌన్, జులై 26 (ప్రభ న్యూస్) : గత నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో మండలంలోని అన్ని చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. మండలంలోని కంటేపాలెం గ్రామంలో, రాకపోకలకు అంతరం కలుగుతుందని తెలుసుకున్న మంత్రి దయాకర్ రావు కండే పాలెం చెరువును పరిశీలించి పూజలు చేశారు. అదేవిధంగా తొర్రూర్ లోని పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో చెరువు వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి దయాకర్ రావు పూజలు చేశారు. మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement