సింగరాజుపల్లిని మండల కేంద్రం చేయండి!
మంత్రిని కలిసి విన్నవించిన ఆయా గ్రామాల ప్రతినిధులు
పటేల్ గూడెం (జనగామ) : నిత్యం జనంలోనే, జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తన స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడరు. ఎక్కడ? ఎలా? అయినా సరే, జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా… అనేక సందర్భాల్లో ప్రవర్తించిన మంత్రి మరోసారి తన రూటే సెపరేటని నిరూపించారు. తాజాగా, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్ విగ్రహావిష్కరణకు వెళుతూ జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్ మండలం కుందారం (పటేల్ గూడెం) క్రాస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నియోజకవర్గంలోని సింగరాజుపల్లి, ఆ చుట్టు ముట్టు గ్రామాలకు చెందిన పలువురు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆ పక్కనే ఉన్న చిన్న గుడిసె హోటల్ ముందు ఆగారు.
అక్కడే ప్రయాణీకుల కోసం వేసి ఉన్న ఓ చైర్ మీద కూర్చున్నారు. వాళ్ళతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు సింగరాజుపల్లి చుట్టు ముట్టు గ్రామాలను కలిపి మండల కేంద్రం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసి వారిలో దేవరుప్పుల పిఎసిఎస్ చైర్మన్ లింగాల రమేశ్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కత్తుల విజయ్, పెద్ద మడూరు సర్పంచ్ పెద్దారెడ్డి, సింగరాజుపల్లి సర్పంచ్ మల్లేశ్, నేల పోగుల సర్పంచ్ దూసరి గణపతి, చిన్నమడూరు ఎంపీటీసీ మల్లికార్జున్, ధరావత్ తండా సర్పంచ్ గేమా, నల్లకుంట తండా సర్పంచ్ రాజన్న, టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఉపాధ్యక్షుడు ఉమేశ్, పార్టీ సినియర్ నాయకులు సంజీవరెడ్డి, భిక్షపతి, బండి నర్సింహులు, మేడ వెంకటేశ్, జోగు సోమరాజు, వంగ అర్జున్ తదితరులు ఉన్నారు.