Saturday, November 23, 2024

లాభాల్లో ఉన్న సంస్థలను అమ్మేస్తున్నాం !

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న వేళ, ఆ ఒక్క సంస్థ మాత్రమే కాదు, ఏకంగా 35 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం సహా కొన్నింటిని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రయత్నిస్తోంది. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ రాకూర్ ఈ విషయం వెల్లడించారు. ఎంపీలు మనోజ్ కోటక్, పినాకి మిశ్రా, రక్ష నిఖిల్ ఖడ్సే అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానమిస్తూ 35 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని, 2016 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. నీతి ఆయోగ్సి ఫార్సుల మేరకే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ చేపడుతున్నట్టు వివరించారు. ఆ సంస్థల లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈ ప్రక్రియ చేపట్టినట్టు స్పష్టం చేశారు. లాభాల్లో ఉన్న సంస్థలు కూడా ప్రైవేటీకరించే సంస్థల జాబితాలో ఉన్నాయని తెలిపారు.

2021-22 బడ్జెట్లో ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రైవేటీకరణతో ఉపాధి పెరుగుతుంది ప్రైవేటీకరణ ద్వారా ఆయా సంస్థలకు మూలధనం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూరతాయని, సరికొత్త యాజమాన్య పద్ధతులతో సంస్థలను లాభాలబాట పట్టించే అవకాశాలుంటాయని అనురాగ్ సింగ్ ఠాకూర్ తన సమాధా నంలో పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ అనంతరం సంస్థ ఆర్థిక, వాణిజ్య కార్యాకలాపాలు, అనుబంధ సంస్థల వ్యాపారం పెరుగుతుందని తెలిపారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సూత్రీకరించా రు. ఫలితంగా దేశ ఆర్థికవద్ధికి ఊతమిచ్చినట్టు అవుతుందని వెల్లడిం చారు. ప్రైవేటీకరణతో సంస్థ యాజమాన్యం మాత్రమే మారుతుందని, సంస్థలోఉద్యోగులు కొనసాగుతారని కేంద్రం పేర్కొన్నారు. ప్రైవేటీకరణ అనంతరం సంస్థ పురోగతి కారణం గా ఉద్యోగుల స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు.

ప్రైవేటీకరణ జాబితాలో లాభాల్లో కొనసాగుతున్న సంస్థలు:

  1. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, బెంగళూరు
  2. ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్,నోయిడా (యూపీ)
  3. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ (ఇండియా) లిమిటెడ్, న్యూఢిల్లీ
  4. బ్రిడ్జ్ అంట్ రూఫ్ కంపెనీ ఇండియా లిమిటెడ్, హౌరా (పశ్చిమ బెంగాల్)
  5. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సహిబాబాద్ (యూపీ),
  6. ఫెర్రోప్ నిగమ్ లిమిటెడ్, భిలాయ్, చత్తీస్ గఢ్
  7. నాగర్నార్ స్టీల్ ప్లాంట్ (ఎన్ఎండీసీ)
  8. సెయిల్ స్టీల్ ప్లాంట్లు (దుర్గాపూర్, సేలం)
  9. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్,కోల్‌కత్తా.
  10. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ముంబై
  11. ది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,ముంబై,
  12. కంటెయినర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,న్యూఢిల్లీ
  13. హెచ్.ఎల్.ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్, తిరువనంతపురం
  14. ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్,ఉత్తరాఖండ్
  15. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లి మిటెడ్, న్యూఢిల్లీ ప్రైవేటీకరణ జాబితాలో నష్టాల్లోని సంస్థలు:
  16. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం స్టీల్ప్లాంట్)
  17. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, న్యూఢిల్లీ
  18. పవన్ హాన్స్ లిమిటెడ్, నోయిడా (యూపీ)
  19. ఎయిరిండియా (అనుబంధ 5 సంస్థలు), న్యూఢిల్లీ
    వస్థాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, పుణె
  20. నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, భువనేశ్వర్

న్యాయపరమైన చిక్కులతో ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిన సంస్థల జాబితా:

  1. హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్, కొట్టాయం (కేరళ)
  2. కర్నాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్లిమిటెడ్, బెంగళూరు

ప్రైవేటీకరణ సాధ్యపడకమూసివేత నిర్ణయం తీసుకున్న సంస్థల జాబితా:

- Advertisement -
  1. హిందుస్థాన్ ఫ్లూరోకార్బన్స్ లిమిటెడ్, మెదక్ (తెలంగాణ)
  2. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్, లక్నో
  3. భారత్ పంప్స్ అండ్ కంప్రెసర్స్ లిమిటెడ్, అలహాబాద్
  4. హిందుస్థాన్ ప్రీఫ్యాబ్ లిమిటెడ్, న్యూఢిల్లీ

లావాదేవీలు పూర్తయిన సంస్థల జాబితా:

  1. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్,ముంబై
  2. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, న్యూఢిల్లీ
  3. హెచ్ఎస్సీసీ (ఇండియా) లిమిటెడ్, నోయిడా (యూపీ)
  4. నేషనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్,ఫరీదాబాద్ (హరియాణా)
  5. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం
  6. టీహెచ్ డీసీ, రిషికేశ్ (ఉత్తరాఖండ్)
  7. నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్,షిల్లాంగ్ (మేఘాలయ)
  8. కామరాజ్ పోర్ట్ లిమిటెడ్, చెన్నై
Advertisement

తాజా వార్తలు

Advertisement