Friday, November 22, 2024

కర్నూల్ కస్తూరిబా పాఠశాలలో 53 మంది విద్యార్థులకు కరోనా

కర్నూల్ జిల్లాలో కరోనా కలకలంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరాతీశారు. కర్నూల్ జిల్లా ఆదోని శంకర్ నగర్ లో ఉన్న కస్తూరిబా గాంధీ స్కూల్ లో 53 విద్యార్థునులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. మొత్తం కస్తూరిబా స్కూల్ లో 300మంది విద్యార్థులు ఉన్నారు.


దీనితో కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేశారు. కర్నూల్ జిల్లా DMHO డాక్టర్ రామ గిడ్డయ్యతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని స్కూల్ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. దీనితో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ DMHO డాక్టర్ రంగా నాయక్ పర్యవేక్షణలో ఈ కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి.

అదే విధంగా జిల్లా వ్యాప్తంగా కరోనా నివారణకు ముందోస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ఇప్పటికే కరోనా సోకిన విద్యార్థులను హోమ్ ఐసోలేషన్ లో వైద్య అధికారులు ఉంచారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండడంతో ముందస్తుగా కర్నూల్ జిల్లాలో 11ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ ను సిద్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement