Saturday, November 23, 2024

కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు మరోసారి పరీక్షలు

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్‌ పరీక్షలు అనివార్యమని, కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాష్ట్రంలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతేడాదితో పోల్చితే ఈ సారి అదనంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 146 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా గుంటూరులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక అధికారి ఉంటారని చెప్పారు. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్, ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల భవిష్యత్, భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. మెటీరియల్స్‌ ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నాయన్నారు. ప్రతి సెంటర్ లో ఐసోలేషన్ సెంటర్, పిపిఈ కిట్లు అందుబాటులో ఉంటుందని తెలిపారు. పరీక్షలు నిర్వహణ తమ బాధ్యత అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయలేదని గుర్తుచేశారు.

పరీక్షలు నిర్వహణ కేంద్రం రాష్ట్రాలకు నిర్ణయం వదిలిపెట్టిందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థలు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి సెంటర్‌లో ఒక పారా మెడికల్ సిబ్బందితో పాటు ఐసోలేషన్‌ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్‌ రూమ్‌లో పరీక్ష రాయిస్తామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ జరపనున్నాం చెప్పారు. ఈరోజు(ఏప్రిల్‌ 29) సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు మంత్రి సూచించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని, అది సప్లిమెంటరీ పరీక్ష కిందకు రాదని స్పష్టం చేశారు. పరీక్షలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ‌కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement