Sunday, November 17, 2024

రాష్ట్ర వ్యాప్తంగా మినీ ట్యాంక్‌ బండ్‌లు.. ఇప్పటికే పూర్తి అయిన 50 శాతం చెరువులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల సుందరీకరణతో అహ్లాదకరవాతావరణం వెల్లి విరుస్తోంది. తరతరాల చరిత్రకు, సంస్కృతికి ప్రతిరూపాలుగా నిలిచిన చెరువుల సుందరీకరణతో పల్లెలు,పట్టణాలు, గ్రామాలు మురిసిపోతున్నాయి. చెరువు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువుగా కాకతీయ రాజులు నిర్మించిన వేయి సంవత్సరాల తర్వాత సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ పేరుతో పూడికలు తీయించారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఒకచెరువును మినీ ట్యాంక్‌ బండ్‌ గా తీర్చి దిద్ది ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే తలంపుతో ప్రారంభించిన పనులు ప్రస్తుత శీతాకాలంలో వేగం పుంజుకున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక చెెరువులు మినీట్యాంక్‌ బండ్‌ గా సింగారించుకున్నాయి. మిగతా చెరువులను వేసవిలోగా పూర్తి చేసి చెరువు కట్టలపై వాకింగ్‌, యెగా, సైకిలింగ్‌ తో పాటు బోటింగ్‌ చేసుకునే విధంగా అధికారులు పనుల్లో వేగం పెంచారు. హైదరాబాద్‌ లో క్రీ.శ. 1658 లో ిబ్రహీం కుతుబ్‌ షాహీ నిర్మించిన ట్యాంక్‌ బండ్‌ మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతినియోజక వర్గంలోని చరిత్రాత్మక చెరువులను తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడంతో పాటుగా చెరువునిర్మించినప్పటి చరిత్ర, సంస్కృతి ప్రజలకు వివరిస్తూ తెలంగాణ కీర్తినిఇనుమడింపచేసేందుకు సీఎం కేసీఆర్‌ మదిలో మెదిలిన మినీట్యాంక్‌ బండ్‌ లనిర్మాణాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి.

- Advertisement -

రూపుదిద్దుకుంటున్న చెరువులు

చరిత్ర గతుల్లో అనేక రాజవంశాల పానకు, వ్యవసాయ రంగం ప్రోత్సాహానికి నిర్మించిన చెరువులు రాష్ట్రంలో 46వేల 531 ఉండగా వాటిలో నియోజకవర్గానికి ఒక చరిత్రాత్మక చెరువును మినీట్యాంక్‌ బండ్‌ గా తీర్చి దిద్దుతున్నారు. కాకతీయుల కాలంలో పురుడుపోసుకున్న జగిత్యాల లోని మద్దల చెరువు పలువురిని ఆకట్టుకుంటుంది. ఇక్కడ 3.20 కోట్ల వ్యయంతో కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు ప్రత్యేక శ్రద్ధతీసుకుని చెరువును అందంగా తీర్చి దిద్దడంతోపాటుగా నడకమార్గం, గర్డెన్‌ తీర్చి దిద్దారు. ఒకప్పటి కాలుష్య సాగరం ఇప్పుడురూపురేఖలు మార్చుకుని అందంగా అలరాలుతుంది. సిద్ధిపేటలోని కోమటి చెరువు ప్రకృతి అందాలకు చెరగని చిరునామాగా మిగిలింది.

ప్రశాంతత కోరుకునే వారికి ఇక్కడ అనిర్వచనీయ అనుభూతిదొరుకుతుంది. పక్కన ఉన్నఅడ్వంచర్‌ పార్క్‌, యోగాకేంద్రం, పూలతోటలు, బోటింగ్‌,జిప్‌ సైక్లింగ్‌ తదితర సౌకర్యాలతో రాష్ట్రంలో అందమైన మినీట్యాంకుబండ్‌ గా ప్రజలను ఆకర్షిస్తుంది. చెరువుపై లేజర్‌ లైట్‌ అండ్‌ తదితర అంతర్జాతీయ ప్రమాణాలకు ఈ చెరువు వేదికైంది. చాళుక్యరాజుల కాలంలో తవ్విన భువనగిరి చెరువు, మధిరలో కాకతీయలు తవ్వించిన చెరువు, సూర్యపేటలో సద్దల చెరువు, మద్దులచెరువు, ముస్తాబాద్‌ లోని కాకతీయుల చెరువు, ఖానాపూర్‌ లో నిజాం రాజులు నిర్మించిన చెరువు. పటాన్‌చెరులోని చాళుక్యులకాలంనాటీ సాకీచెరువు, అలేరు పాతచెరువు, జమీందారులు నిర్మించిన సరూర్‌ నగర్‌ చెరువు, సిరిసిల్ల చెరువు, భైంసా చెరువు, రాయదుర్గం చెరువు, మల్కం చెరువు తో పాటుగాసుమారు 50 చెరువులు మినీట్యాంక్‌ బండ్‌ లా రూపుదిద్దుకోగా సుమారు 25 చెరువుల్లో దాదపుగా పనులు పూర్తికాగా మిగతా చెరువులు వేసవిలోగా పూర్తిచేయాలనే ధృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ని చెరువుల సుందరీకరణ ప్రభుత్వం ప్రత్యేకంగా కు రూ.48కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడంతో అనేక ప్రాచీనచెరువులు మినీట్యాంక్‌ బండ్‌ మాదిరిగా రూపుదిద్దు కున్నాయి. చెరువుకట్టలుదాదాపుగా 6మీటర్ల వెడెల్పు, పొడుగు 300 మీటర్లు ఉన్నవాటికి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే నల్కొండజిల్లా చందుపట్ల సమీపంలోని రాచ చెరువు అదాలను ద్విగుణీకృతం చేస్తున్నాయి. నియోజక వర్గానికి ఒక చెరువును మినీట్యాంక్‌ బండ్‌ ల మాదిరిగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 568. 75 కోట్ల ను విడుదల చేసింది. అలాగే సుందరీకరణ లో భాగంగా ప్రత్యేక సదుపాయాలకు నియోజకవర్గాల శాసనసభ్యులు తమ నిధుల్లోంచి కొంత విడుదల చేశారు.

హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ ఆదర్శం

1568 లో నిర్మించిన ట్యాంక్‌ మాదిరిగా రాష్ట్రంలోని 119 చెరువులను తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా చెరువుల సుందరీకరణ, మినీట్యాంక్‌ బండ్‌ ల నిర్మాణాలు సాగుతున్నాయి. రాష్ట్రాన్ని పాలించిన అనేక రాజవంశాలు తమశక్తి కొలది నిర్మించిన చెరువులే శతాబ్దాల తరబడి ప్రజలకు జీవనాధారమయ్యాయి. వాటిని పునరుద్ధరించడంతో పాటుగా ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యానికి వాకింగ్‌ ట్రాక్‌ లు, బతుకమ్మలకోసం ప్రత్యేక సరస్సులు, బోటింగ్‌, సైకిలింగ్‌,ధ్యానకేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చెరువులను సుందరంగా తీర్చిదిద్దడం గొప్పకార్యంగా ప్రజలు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement