Friday, November 22, 2024

గుజ‌రాత్ లో ఎంఐఎం పాగా…

హైద‌రాబాద్ – తెలంగాణా కేంద్రంగా అస‌దుద్దీన్ ఓవైసీ నాయ‌క‌త్వంలో ప‌ని చేస్తున్న ఎంఐఎం పార్టీ జాతీయ స్థాయి పార్టీగా ఒక్కో రాష్ట్రంలో చొచ్చుకువెళుతున్న‌ది.. హైద‌రాబాద్ ఎంపి స్థానంతో పాటు ప‌లు ఎమ్మెల్యే సీట్లు సాధించిన ఎంఐఎం గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌లోనూ స‌త్తా చాటింది.. ఇక మ‌హారాష్ట్ర‌లో సైతం ఒక ఎంపి, రెండు ఎమ్మెల్యే స్థానాల‌తో అక్క‌డ పాగా వేసింది.. ఇటీవ‌ల జ‌రిగిన బీహార్ ఎన్నిక‌ల‌లోనూ అయిదు ఎమ్మెల్యే సీట్లు గెలిచి జాతీయ పార్టీగా నిలిచింది.. తాజాగా గుజ‌రాత్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లోనూ పోటీ చేసిన కొన్ని స్థానాల‌లోనూ అత్య‌ధిక సీట్లు కైవ‌సం చేసుకుని బిజెపి, కాంగ్రెస్ ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది.. గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికలలో 2002లో అలర్లు జరిగిన గోద్రాలో 9 స్థానాల్లో పోటీ చేయగా 7 స్థానాలు గెలుచుకుంది. గోద్రా మున్సిపాలిటీలో ఎంఐఎం పోటీకి దిగడం ఇదే మొదటిసారి. కొద్ది రోజుల క్రితం విడుదలైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం సత్తా చాటింది. అహ్మదాబాద్ కార్పొరేషన్ పరిధిలో 4 స్థానాలను ఎంఐఎం చేజిక్కించుకుంది. ఇకపోతే, మొదాసాలో 12 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 9 స్థానాలు గెలుచుకుంది. బరూచ్‌లో కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఈ ఉత్సాహంతో ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లోనూ పోటీకి దిగుతున్న‌ది.. ఇక్క‌డ కూడా ఎంఐఎం స‌త్తా చాటుతామ‌ని ఆ పార్టీ చీఫ్ అస‌దుద్దీన్ ధీమాగా ఉన్నారు.. త‌మ‌ది అస‌లైన సెక్యుల‌ర్ పార్టీ అని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement