అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇట్టేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధికారిక ట్విట్టర్ ఖాతాను ఆదివారం కొందరు దుండగులు హ్యాక్ చేశారు. ఖాతా పేరు మార్చిన హ్యాకర్లు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ పేరిట మార్చారు. అలాగే ప్రొఫైల్ ఫొటోను సైతం మార్చి ఎలన్ మస్క్ చిత్రాన్ని ఉంచారు. దీంతో ఖాతా హ్యాకింగ్‌పై ఎంఐఎం ట్విట్టర్‌కు ఫిర్యాదు చేసింది.
కగా వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ ఏఐఎంఐఎం పార్టీ పోటీ చేయనుంది. ఇటీవల ఈ విషయాన్ని ఓవైసీ ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ సహకారంతో పార్ట్‌నర్‌షిప్ సంకల్ప్ మోర్చాను ఏర్పాటు చేశారు. బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: శేరిలింగంపల్లిలో అగ్నిప్రమాదం